ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్ కోసం అధికంగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ios వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది. వాట్సాప్‌లోని ముఖ్య అంశాలలో ఎమోజిలు మరియు స్టిక్కర్లు ముందు వరుసలో ఉన్నాయి. ఇవి మనిషి యొక్క భావాలను మరియు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి మరియు అలరించడానికి ఉపయోగించబడ్డాయి. ఇది తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తున్నది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.20.197.6 బీటాలోని తాజా మార్పులలో కొత్తగా 138 ఎమోజీలను తీసుకురావడానికి పరీక్షిస్తోంది.
వాట్సాప్ యొక్క తాజా అప్ డేట్ లలో 138 కొత్త ఎమోజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ వినియోగదారులకు యానిమేటెడ్ స్టిక్కర్లను విడుదల చేసిన కొద్ది రోజులకే వీటిని కూడా జోడించింది. సాధారణ స్టిక్కర్ ప్యాక్‌లతో పాటు యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి వినియోగదారులకు మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి అందించబడతాయి.
వాట్సాప్‌లోని కొత్త ఎమోజీలు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటికి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. మొదటి చూపులో మీరు వీటి మధ్య గల తేడాను ఖచ్చితంగా గమనించలేరు. కొన్ని కొత్త ఎమోజీలలో కొత్త రంగు టోన్లు బట్టలు, కేశాలంకరణ మరియు స్కిన్ టోన్లలో మార్పులు కూడా ఉన్నాయి.
Whatsapp ఆండ్రాయిడ్ 2.20.197.6 బీటా డౌన్‌లోడ్
వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్ 2.20.197.6 బీటాలో సరికొత్త ఎమోజీల రాకను మొదట నివేదించింది. అయితే మీరు గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లోని తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా కొత్త మార్పును కూడా చూడవచ్చు. అలాగే దీనికి ప్రత్యామ్నాయంగా APK ఫైల్‌ను APK మిర్రర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ గత నెలలో ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ వినియోగదారులకు యానిమేటెడ్ స్టిక్కర్లను తీసుకువచ్చింది. ప్రారంభ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌ల జాబితాలో రికోస్ స్వీట్ లైఫ్, ప్లేఫుల్ పియోమారు, బ్రైట్ డేస్, మూడీ ఫుడీస్ మరియు చమ్మీ చుమ్ చుమ్స్ ఉన్నాయి.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి